akhil: అఖిల్ కి జోడీగా నిధి అగర్వాల్ కి ఛాన్స్!

  • 'తొలిప్రేమ'తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి
  • హీరోగా అక్కినేని అఖిల్
  • యూత్ కి కనెక్ట్ అయ్యే ప్రేమకథాంశం

ప్రస్తుతం అఖిల్ .. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ దర్శకుడు చేసిన 'తొలిప్రేమ' ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అందువల్లనే ఆయన దర్శకత్వంలో చేయడానికి అఖిల్ ఉత్సాహాన్ని చూపించాడు. అఖిల్ తో కూడా ఆయన యూత్ కి కనెక్ట్ అయ్యే కథనే చేస్తున్నాడు.

 ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలనే విషయంలో చాలామంది పేర్లను పరిశీలించారు. తాజాగా నిధి అగర్వాల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఆమెపై టెస్ట్ కట్ చేసిన తరువాతనే ఓకే చేశారట. అఖిల్ మూవీలోని పాత్రకి ఈ అమ్మాయి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. నిధి అగర్వాల్ ప్రస్తుతం చైతూ సరసన 'సవ్యసాచి' సినిమా చేస్తోంది. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే, అఖిల్ మూవీలో ఆమెకి అవకాశం దొరకడం విశేషం.  

More Telugu News