Twitter: 33 కోట్ల మంది యూజర్లకు ట్విట్టర్ హెచ్చరిక!

  • ఓ బగ్ ను కనుగొన్నాం
  • ఆపై దాన్ని తొలగించాం
  • ముందుజాగ్రత్త చర్యగానే హెచ్చరికలు
  • అఫీషియల్ బ్లాగ్ లో ట్విట్టర్

స్మార్ట్ ఫోన్లలో సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ను వాడుతున్న 33 కోట్ల మంది యూజర్లూ తమ పాస్ వర్డ్ లను వెంటనే మార్చుకోవాలని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్విట్టర్ ఐఎన్సీ హెచ్చరించింది. తమ అంతర్గత కంప్యూటర్ సిస్టమ్స్ లో స్టోర్ అయిన టెక్ట్స్ మెసేజ్ లలో ఓ బగ్ ను కనుగొన్నామని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

దీన్ని తొలగించామని, ఈ బగ్ వల్ల ఎవరి పాస్ వర్డ్ లూ దొంగిలించబడినట్టు ఇప్పటివరకూ తేలలేదని, ముందు జాగ్రత్త చర్యగానే పాస్ వర్డ్ లు మార్చుకోవాలని సూచిస్తున్నామని తన అఫీషియల్ బ్లాగ్ లో ట్విట్టర్ పేర్కొంది. కాగా, ఎంతమంది పాస్ వర్డ్ లపై ఈ ప్రభావం ఉంటుంది? ఏఏ దేశాల వారు మార్చుకోవాలన్న విషయమై స్పష్టత ఇవ్వని ట్విట్టర్, ఎన్నో నెలల పరిశోధన తరువాత బగ్ బయటకు వచ్చిందని పేర్కొంది.

కాగా, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఖాతాలు చోరీకి గురవుతున్నాయన్న ఆందోళనల మధ్య ప్రభుత్వాలు, నియంత్రణా సంస్థలు సామాజిక మాధ్యమ సేవలందిస్తున్న సంస్థలపై నిబంధనలను కఠినతరం చేస్తున్న వేళ ట్విట్టర్ ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం.

More Telugu News