Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సినిమా కలల ప్రపంచంలో అనుష్క 
  • కొరటాల సినిమాలో అఖిల్?
  • 40 కోట్లు తీసుకుంటున్న రజనీకాంత్

*  తనకి వచ్చే కలలు ఎక్కువగా సినిమాలకు సంబంధించినవే ఉంటాయంటోంది అందాలతార అనుష్క. "నేను ఎక్కువగా సినిమాల గురించే ఆలోచిస్తూ వుంటాను. అందుకే నాకొచ్చే కలలు కూడా వాటికి సంబంధించినవే వుంటాయి. రేపు నా సినిమా రిలీజవుతోందంటే ఇక ఆ రాత్రి కలలన్నీ ఆ సినిమా గురించే వస్తాయి" అని చెప్పింది.
*  'భరత్ అనే నేను' చిత్రంతో తాజాగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించే తదుపరి చిత్రంపై రకరకాల వార్తలు ప్రచారంలో వున్నాయి. ఈ క్రమంలో అఖిల్ అక్కినేనితో ఆయన ఓ చిత్రాన్ని చేయనున్నట్టు, ఇది వచ్చే డిసెంబర్లో ప్రారంభం కానున్నట్టు సమాచారం.
*  సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రానికి 40 కోట్ల భారీ పారితోషికాన్ని తీసుకుంటున్నాడట. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మించే ఈ చిత్రానికి పారితోషికంగా నలభై కోట్లు చార్జ్ చేస్తున్నాడట.  

More Telugu News