USA: కుప్పకూలిన యూఎస్ మిలటరీ విమానం!

  • జార్జియాలో ఘటన
  • ఐదుగురి మృతి
  • ప్రమాదానికి గల కారణాలపై అధికారుల విచారణ

అమెరికా రక్షణ రంగానికి కార్గో సేవలందిస్తున్న ఓ మిలటరీ విమానం జార్జియాలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురూ మరణించారని అధికారులు తెలిపారు. సిటీ ఆఫ్ సవన్నా సమీపంలోని విమానాశ్రయం హైవేపై ఈ విమానం కూలిందని, జార్జియా నేషనల్ గార్డ్ ప్రతినిధి డిసిరీ బంబా వెల్లడించారు.

ఇది సీ-130 రకానికి చెందిన విమానమని, ప్యూర్టోరికో నేషనల్ గార్డ్ టీమ్ దీని సేవలను అందుకుంటోందని తెలిపారు. ఈ విమానంలో ఉన్న ఐదుగురూ ఎవరన్న సంగతి ఇంకా తెలియరాలేదని, వారి వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. విమాన ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు.

More Telugu News