sharwanand: శర్వానంద్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకుడు

  • హను రాఘవపూడితో ఓ సినిమా 
  • సుధీర్ వర్మతోను ఒక ప్రాజెక్టు 
  • వెయిటింగులో 'దండుపాళ్యం' దర్శకుడు

ప్రస్తుతం శర్వానంద్ .. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలోను ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నవే. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే, శర్వానంద్ కి దర్శకుడు శ్రీనివాసరాజు ఒక కథ వినిపించాడు.

గతంలో ఆయన 'దండుపాళ్యం' సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఆయన ప్రాజెక్టు పట్ల శర్వానంద్ పెద్దగా ఆసక్తిని చూపించలేదనీ, అందువలన ఆ ప్రాజెక్టు అటకెక్కేసినట్టేననే టాక్ వినిపించింది. అయితే ఈ ప్రాజెక్టుకు శర్వానంద్ నో చెప్పలేదనీ .. వెయిటింగ్ లిస్టులో మాత్రమే పెట్టాడనేది తాజా సమాచారం. త్వరలోనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాడనీ .. ఆ సమయం కోసం శ్రీనివాసరాజు వెయిట్ చేస్తున్నాడని అంటున్నారు.       

More Telugu News