whatsapp: వాట్సాప్ లో ఇక గ్రూప్ కాలింగ్... ఒకేసారి ఒకరికి మించి వీడియో కాల్

  • ఫేస్ బుక్ వార్షిక సమావేశంలో జుకెర్ బర్గ్ ప్రకటన
  • వచ్చే కొన్ని నెలల్లో అందుబాటులోకి
  • ప్రైవేటు స్టిక్కర్లను వినియోగించుకునేందుకు అవకాశం

వాట్సాప్ లో వీడియో కాల్ ను ఒకేసారి ఒకరికి మించి గ్రూపు పరిధిలో చేసుకునే అవకాశం వస్తోంది. త్వరలోనే గ్రూప్ వాయిస్, వీడియో కాల్ సేవలను ఆరంభించనున్నట్టు ఫేస్ బుక్ (వాట్సాప్ కూడా ఫేస్ బుక్ సంస్థదే) సీఈవో మార్క్ జుకర్ బెర్గ్ ప్రకటించారు. ఫేస్ బుక్ వార్షిక ‘ఎఫ్8 డెవలపర్ల సమావేశం’లో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం.

‘‘వాట్సాప్ లో వాయిస్, వీడియో కాలింగ్ కు చాలా ఆదరణ ఉంది. రానున్న నెలల్లో గ్రూప్ కాలింగ్ కూడా అందుబాటులోకి రానుందనే సమాచారాన్ని పంచుకునేందుకు ఉత్సాహంగా ఉంది. వాట్సాప్ లో స్టిక్కర్లు కూడా రానున్నాయి’’ అని ఫేస్ బుక్ కంపెనీ బ్లాగ్ లో పోస్ట్ చేసింది. డెవలపర్లు అభివృద్ధి చేసిన ధర్డ్ పార్టీ స్టిక్కర్లను కూడా వాట్సాప్ అనుమతించనుంది. వాట్సాప్ కు దేశంలో 20 కోట్ల యూజర్లు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది దీన్ని వినియోగిస్తున్నారు. ఈ సంస్థను 2014లో ఫేస్ బుక్ కొనుగోలు చేసింది.

More Telugu News