kaala: 'యమ గ్రేటు' అంటూ మాస్ సాంగ్ తో వచ్చిన రజనీకాంత్!

  • కాలా చిత్రం నుండి ఫ‌స్ట్ సాంగ్ విడుదల
  • అభిమానుల‌ని అలరిస్తున్న 'య‌మ గ్రేట్' సాంగ్
  • మే 9న పూర్తి ఆడియో విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం నుండి తాజాగా ఫ‌స్ట్ సాంగ్ ని విడుదల చేశారు. 'య‌మ గ్రేట్' అంటూ సాగే ఈ పాట‌ ర‌జ‌నీ అభిమానుల‌ని అల‌రిస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకి సంతోష్ నారాయ‌ణ్ సంగీతం అందించారు. అలాగే ఈ పాట‌కి తెలుగు లిరిక్స్‌ను ప్రణవ్ చాగంటి అందించగా హ‌రిహ‌ర‌సుధ‌న్, సంతోష్ నారాయణ్ క‌లిసి పాడారు. కాగా ఈచిత్రం పూర్తి ఆడియోను మే 9న విడుదల చేయనున్నారు.

More Telugu News