bus: బస్ కింద పడబోయిన చిన్నారి.. వెంట్రుక వాసిలో తప్పించుకున్న వైనం

  • వీడియో వైరల్
  • చైనాలో ఘటన
  • బాలుడికి స్వల్పగాయం

ఆరేళ్ల ఓ చిన్నారిని పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళుతోంది ఓ తల్లి. అయితే, రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళుతోన్న క్రమంలో ఆ బాలుడు ఆడుకుంటూ పరుగెడుతూ వెళుతూ ఒక్కసారిగా అదుపుతప్పి బస్సు కింద పడబోయాడు. అదృష్టం బాగుండి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కిందపడిపోయిన ఆ చిన్నారిని అతడి తల్లి లేపి తీసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ బాలుడికి స్వల్పగాయం అయింది. ఈ ఘటన చైనాలోని చోన్‌క్వింగ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.   

More Telugu News