gst: జీఎస్టీతో పిండేస్తున్నారు... ఒక్క ఏప్రిల్ లోనే ఎంత వసూలైందో తెలుసా?

  • ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో వసూళ్లు
  • రూ. 1.03 లక్షల కోట్ల జీఎస్టీ కలెక్షన్స్
  • గత ఆగస్టు నుంచి 2018 మార్చి వరకు రూ. 7.19 లక్షల కోట్ల వసూలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీతో జనాలకు ఎలాంటి లాభం ఉందో అర్థంకాకపోయినా... కేంద్ర ఖజానా మాత్రం గలగలలాడుతోంది. ఈ ఏప్రిల్ లో ఏకంగా రూ. 1.03 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గత ఏడాది జులైలో కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత ఈ రేంజ్ లో జీఎస్టీ వసూలు కావడం ఇదే ప్రథమం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెటిల్ మెంట్ తర్వాత.... సీజీఎస్టీ కింద కేంద్రానికి రూ. 32,493 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రాష్ట్రాలకు రూ. 40,257 కోట్ల ఆదాయం సమకూరిందని ఆర్థిక శాఖ తెలిపింది. 2017 ఆగస్టు నుంచి 2018 మార్చి వరకు రూ. 7.19 లక్షల కోట్లు జీఎస్టీ కింద వసూలయ్యాయి.   

More Telugu News