snap deal: వేలాది కోట్ల రూపాయలను నష్టంగా చూపించిన ‘స్నాప్ డీల్’

  • 2017-18లో రూ.4,647 కోట్ల నష్టం
  • అంతకుముందు సంవత్సరంలో రూ.3,340 కోట్ల నష్టం
  • ఆదాయంలోనూ క్షీణత

దేశ ఈ కామర్స్ రంగంలో ముందే అడుగు పెట్టినా, మునిగిపోయే స్థితికి చేరి స్నాప్ డీల్ అల్లాడుతోంది. ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే ఈ సంస్థ రూ.4,647 కోట్లను నష్టపోయింది. జాస్ఫర్ ఇన్ఫోటెక్ ఈ సంస్థను నిర్వహిస్తోంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ చూపించిన నష్టం రూ.3,340 కోట్లు. ఇక 2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి కాలంలో ఈ సంస్థకు 1,291 కోట్ల ఆదాయం లభించింది.

అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 1,478 కోట్ల కంటే 12 శాతం తగ్గింది. అయితే, తమ పనితీరును మెరుగుపరుచుకున్నామని, నిర్వహణ నష్టాలు 25 శాతం తగ్గినట్టు స్నాప్ డీల్ తెలిపింది. ఫ్లిప్ కార్ట్, అమేజాన్ తో పోటీ పడలేక స్నాప్ డీల్ మార్కెట్ వాటాను క్రమంగా కోల్పోతూ వచ్చింది. నష్టాల్లో ఉన్నా గతేడాది ఈ సంస్థను 950 మిలియన్ డాలర్లకు కొనేందుకు ఫ్లిప్ కార్ట్ ముందుకు రాగా, స్నాప్ డీల్ వ్యవస్థాపకులు కునాల్ బాహ్, రోహిత్ భన్సాల్ అంగీకరించలేదు. 

More Telugu News