nani: నాని ఆలోచనలో పడ్డాడు .. ఆ దర్శకుడితో సినిమాను ఆపేశాడు

  • చాలా గ్యాప్ తరువాత వచ్చిన ప్లాప్
  • కారణాలను అర్థం చేసుకున్న నాని 
  • కథల విషయంలో జాగ్రత్తలు

'కృష్ణార్జున యుద్ధం' సినిమాకి ముందువరకూ నాని వరుస విజయాలను అందుకుంటూ వచ్చాడు. 'కృష్ణార్జున యుద్ధం' మాత్రం ఆయన విజయయాత్రకి గండి కొట్టింది. ఈ సినిమాతో .. కథల ఎంపిక విషయంలో నాని ఆలోచన పక్కదారి పట్టిందనే విమర్శలు వచ్చాయి. తన ఇమేజ్ కి భిన్నంగా వెళ్లడమే ఈ ఫలితానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాల కథల విషయంలో ఆయన మరింత శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నాడట. అందులో భాగంగానే ఆయన విక్రమ్ కుమార్ ప్రాజెక్టును ఆపేశాడని సమాచారం. తనకి ఒకటి రెండు సక్సెస్ లు పడిన తరువాత ఆలోచిస్తాననీ, అప్పటివరకూ ఈ ప్రాజెక్టును పెండింగ్ లో పెట్టాలనుకుంటున్నానని అన్నాడట. అలా విక్రమ్ కుమార్ ప్రాజెక్టుకు రెడ్ సిగ్నల్ చూపించాడని చెబుతున్నారు.

More Telugu News