India: రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన భారత నేవీ విమానం!

  • ఏఎన్ 2-38లో సాంకేతిక లోపం
  • శనివారం రాత్రి ఘటన
  • ఇంకా స్పందించని భారత నేవీ

భారత నావికా దళానికి చెందిన లాంగ్ రేంజ్ ఏఎన్ 2-38 విమానం రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. రష్యా మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, సాంకేతిక లోపం ఏర్పడటంతో విమానం మాస్కోకు పక్కనే ఉపయోగంలోలేని జుకోవ్ స్కీ ఎయిర్ ఫీల్డ్ లో ల్యాండ్ అయింది. విమానంలో చాసిస్ ఫెయిల్యూర్ జరిగిందని, విమానంలో లోపం గురించి తెలియగానే, అత్యవసర బృందాలను అలర్ట్ చేసి విమానం సురక్షితంగా దిగేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు.

శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. కాగా, ఈ విమానం అత్యాధునికమైనది. నావిగేషన్, రాడార్, రేడియో టూల్స్ తో ఉండే ఈ యాంటీ సబ్ మెరైన్ విమానం, నౌకలు, సబ్ మెరైన్లు ఏ ప్రాంతంలో ఉన్నాయన్న విషయాన్ని సులువుగా గుర్తిస్తుంది. కాగా, ఈ ఘటనపై భారత నేవీ ఇంకా స్పందించలేదు.

More Telugu News