donkey: తహసీల్దార్‌ ఉద్యోగాల కోసం.. గాడిదకు హాల్‌ టిక్కెట్‌ జారీ చేసిన అధికారులు!

  • జమ్ముకశ్మీర్‌లో అధికారుల నిర్వాకం
  • పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు
  • తాజాగా హాల్‌ టిక్కెట్ల డౌన్‌లోడ్‌

తహసీల్దార్‌ ఉద్యోగాల కోసం పరీక్ష రాయడానికి ఓ గాడిదకు హాల్‌ టికెట్‌ జారీ చేసిన వింత సంఘటన జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకుంది. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తాజాగా హాల్‌ టిక్కెట్లు పొందగా అందులో ఒకటి గాడిద పేరు, ఫొటోతో ఉంది. ఆ హాల్‌టికెట్‌పై అభ్యర్థి సంతకంతో పాటు జమ్ముకశ్మీర్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు సెక్రటరీ సంతకం సైతం ఉండడం గమనార్హం.

అభ్యర్థి పేరు ఉండే చోట గోధుమ వర్ణపు గాడిద అని ఉంది. ఈ హాల్‌టికెట్‌ ఎలా బయటకు వచ్చిందో కానీ, సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. హాల్‌ టిక్కెట్లు జారీ చేసిన అధికారులపై విమర్శల జల్లు కురుస్తోంది.

More Telugu News