neet: నీట్ పీజీ వైద్య విద్యార్థుల అర్హత మార్కులు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం

  • నీట్ పీజీ వైద్య విద్యార్థుల అర్హత మార్కులు 15 శాతానికి తగ్గింపు
  • దేశ వ్యాప్తంగా మరో 18 వేల మంది విద్యార్థులకు దక్కనున్న సీట్లు
  • ఓ ట్వీట్ లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడి

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) పీజీ వైద్య విద్యార్థుల అర్హత మార్కులను 15 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. నీట్ పీజీ, నీట్ ఎస్ఎస్ (సూపర్ స్పెపాలిటీ) కోర్సులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. కేంద్ర  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా మరో 18 వేల మంది విద్యార్థులకు మెడికల్ సీట్లు అందనున్నట్టు పేర్కొన్నారు.

 కాగా, కేంద్రం చేసిన ఈ ప్రకటనపై ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి కృతఙ్ఞతలు తెలియజేశారు. అర్హత మార్కులు తగ్గించాలని గతంలో తాను కేంద్రాన్ని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా కామినేని ప్రస్తావించారు. 

More Telugu News