JBL: జేబీఎల్ బ్రాండ్ నుంచి వైర్ లెస్ ఆడియో హెడ్ సెట్

  • ధర రూ.9,999
  • బ్లూటూత్ తో డివైజ్ లకు అనుసంధానం
  • నాన్ స్టాప్ గా 4 గంటలు సేవలు

జేబీఎల్ కంపెనీ వైర్లతో పనిలేని ఆడియో ఇయర్ బడ్స్ (హెడ్ సెట్) ను ప్రవేశపెట్టింది. మంచి సౌండ్ తో చక్కని ఆడియో అనుభవం వీటితో పొందొచ్చని కంపెనీ ప్రకటించింది. నాన్ స్టాప్ గా 4 గంటల పాటు ఆడియో వినేందుకు ఇవి సపోర్ట్ చేస్తాయి. తిరిగి రీచార్జ్ చేసుకుని మళ్లీ వినొచ్చు. తిరిగి 15 నిమిషాల్లోనే రీచార్జ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఈ ఇయర్ బడ్స్ ను బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ఆప్షన్ ఉంటే ల్యాప్ టాప్ కు సైతం కనెక్ట్ చేసుకోగలరు. దీని ధర రూ.9,999. బ్లాక్, వైట్ రంగుల్లో లభిస్తుంది.

More Telugu News