youtube: గూగుల్ ప్లే మ్యూజిక్ పోయి... యూట్యూబ్ మ్యూజిక్ వచ్చేస్తోంది!

  • ఈ ఏడాది చివరికి గూగుల్ ప్లే సేవలు ఆగిపోయే అవకాశం
  • దీన్ని ధ్రువీకరించిన గూగుల్
  • ఈ ఏడాది చివరికి స్పష్టత

మైక్రోసాఫ్ట్ బాటలో గూగుల్ అడుగులు వేస్తోంది. మైక్రోసాఫ్ట్ తన ‘స్ట్రీమింగ్ సర్వీస్’ ను నిలిపివేసినట్టే గూగుల్ కూడా ‘గూగుల్ ప్లే’కు మంగళం పాడుతోంది. ఈ ఏడాది చివరికి గూగుల్ ప్లే సేవల స్థానంలో యూట్యూబ్ రీమిక్స్ ను ప్రవేశపెడుతుందన్న సమాచారం బయటకు వచ్చింది. దీన్నే యూట్యూబ్ మ్యూజిక్ గా పేర్కొంటున్నారు.

‘‘మ్యూజిక్ అన్నది గూగుల్ కు చాలా ముఖ్యమైనది. యూట్యూబ్ మ్యూజిక్, గూగుల్ ప్లే రెండూ అందిస్తామని గతంలో ప్రకటించాం. వినియోగదారులు, కళాకారుల అవసరాలను ఒక వేదిక ద్వారా చేరుకోవడం కష్టం. ఒకవేళ ఏదైనా మార్పులు చేయదలిస్తే ముందుగానే తెలియజేస్తాం’’ అని గూగుల్ ప్రతినిధి స్పష్టం చేశారు. దీనిపై ఈ ఏడాది చివరికి గానీ మరింత స్పష్టత రానుంది. గూగుల్ ప్లేలో యూజర్లు ఉచితంగా వేలాది పాటలను అప్ లోడ్ చేసుకునే సౌకర్యం ఉన్న విషయం తెలిసిందే. 

More Telugu News