Narendra Modi: మంగళగిరి ఎయిమ్స్ పై ఆరా తీసిన ప్రధాని మోదీ

  • రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
  • కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్ష
  • ఎయిమ్స్ పనుల పురోగతిని వివరించిన ఏపీ సీఎస్

అమరావతి సమీపంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్ పై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 13 పథకాల తీరును ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా ఏపీలో అమలవుతున్న మూడు పథకాల పురోగతి గురించి ఏపీ చీఫ్ సెక్రటరీని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ పనుల పురోగతిని ప్రధానికి సీఎస్ దినేష్ కుమార్ వివరించారు.

మరోవైపు, విజయనగరం-సంబల్ పూర్ మధ్య 265 కిలోమీటర్ల రైల్వే మూడో లైన్ పనుల తీరుపై రైల్వే శాఖ సెక్రటరీని అడిగారు. ఈ సందర్భంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖ కార్యదర్శి కేడీ తిరుపతి మాట్లాడుతూ, విశాఖ-విజయవాడ-సికింద్రాబాద్ పైప్ లైన్ నిర్మాణ పనులకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సహకారం చాలా బాగుందని కొనియాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ మౌలిక సదుపాయాల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు కూడా పాల్గొన్నారు. 

More Telugu News