ntr: దర్శకుడు తేజ సంచలన నిర్ణయం.. 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన

  • నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత కథ ఆధారంగా 'ఎన్టీఆర్‌'
  • హీరోగా బాలయ్య
  • ఒక్కసారిగా కీలక ప్రకటన చేసిన తేజ
  • రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించే అవకాశాలు ఉండొచ్చని వ్యాఖ్య

నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత కథ ఆధారంగా తేజ, బాలకృష్ణ కాంబినేషన్‌లో 'ఎన్టీఆర్' బ‌యోపిక్ రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి చేతుల మీదుగా జరిగింది. అయితే, ఎన్టీఆర్‌ బయోపిక్‌ నుంచి తాను తప్పుకుంటున్నట్లు దర్శకుడు తేజ ఒక్కసారిగా ప్రకటన చేశారు. తాను ఎన్టీఆర్‌కి వీరాభిమానినని, ఈ సినిమాకి న్యాయం చేయలేకపోతానని తనకు అనిపిస్తోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, ఈ ప్రాజెక్టుకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించే అవకాశాలు ఉండొచ్చని కూడా తేజ చెప్పారు. అయితే, తేజ తీసుకున్న సంచలన నిర్ణయంపై పలు రకాల కామెంట్లు వినపడుతున్నాయి.    

More Telugu News