India: పత్రికా స్వేచ్ఛలో నార్వేకి అగ్ర స్థానం.. భారత్‌కి 138వ ర్యాంకు

  • టాప్‌-5లో స్వీడన్‌, నెదర్లాండ్స్‌, ఫిన్‌లాండ్‌, స్విట్జర్లాండ్‌
  • గతేడాది ఈ సూచీలో 136వ స్థానంలో ఉన్న భారత్
  • కింది నుంచి ఉ.కొరియా ఫస్ట్‌
  • ఉ.కొరియా తరువాత తుర్కమెనిస్థాన్‌, సిరియా, చైనా

ప్రపంచ దేశాల్లో పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్‌ స్థానం మరింత పడిపోయింది. 2018 సంవత్సరానికి గానూ రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) ఈ రోజు వెల్లడించిన ఈ ర్యాంకింగ్స్‌ సూచీలో నార్వే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా స్వీడన్‌, నెదర్లాండ్స్‌, ఫిన్‌లాండ్‌, స్విట్జర్లాండ్‌లు ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛలో అన్ని దేశాల కంటే కింద ఉత్తర కొరియా ఉంది. ఈ దేశం తరువాత కింది నుంచి తుర్కమెనిస్థాన్‌, సిరియా, చైనాలు ఉన్నాయి.

గతేడాది ఈ సూచీలో 136వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు రెండు స్థానాలు కోల్పోయి 138వ స్థానానికి పడిపోయింది. భారత్‌లో జర్నలిజంపై అంతగా స్వేచ్ఛ లేకపోవడం వల్ల ప్రజాస్వామిక వ్యవస్థకు విఘాతం కలుగుతోందని ఆ నివేదికలో ఆర్‌ఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయవాదంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని తెలిపారు. గతేడాది భారత్‌లో ముగ్గురు పాత్రికేయులను హత్య చేశారని, భారత్‌లో పత్రికా స్వేచ్ఛ పతనానికి మోదీ ట్రోల్‌ ఆర్మీలే కారణమని చెప్పారు. ముఖ్యంగా కశ్మీర్‌ లాంటి ప్రాంతంలో మీడియాకు స్వేచ్ఛ లేదని పేర్కొన్నారు.

More Telugu News