break fast: బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని తేల్చి చెబుతోన్న పరిశోధకులు

  • బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోకపోతే నష్టాలు
  • అనారోగ్య సమస్యలు ఎదుర్కునే ప్రమాదం
  • భవిష్యత్తులో బరువు పెరుగుతారని చెబుతోన్న పరిశోధకులు

బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం మానేస్తే భవిష్యత్తులో బరువు పెరగడమే కాకుండా, అనారోగ్య సమస్యలు ఎదుర్కునే ప్రమాదం ఉందని పరిశోధకులు గుర్తించారు. బరువు తగ్గాలని భావించే వారు చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం మానేస్తున్నారని, అయితే, అలా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పారు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకునే 350 మందిని లండన్‌లోని మయో క్లినిక్‌ పరిశోధకులు పరిశీలించగా, పదేళ్ల తరువాత వారి నడుము భాగం సాధారణంగా ఉందని, కేవలం మూడు పౌండ్ల బరువు మాత్రమే పెరిగారని తేల్చారు.

అదే సమయంలో బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోనివారు ఎనిమిది పౌండ్లు పెరిగారని పరిశోధకులు గుర్తించారు. వీరు సరైన మోతాదులో సమతుల ఆహారాన్ని పొందలేకపోవడం వల్లే వారిలో కొవ్వు పేరుకుపోతున్నట్టు చెప్పారు. ఉదయాన్నే పండ్లు, ధాన్యాల వంటి వాటితో కూడిన అల్పాహారం తీసుకుంటే మంచిదని చెప్పారు. బ్రేక్‌ ఫాస్ట్‌ మానేస్తే సన్నబడతామన్న భావనలో నిజం లేదని తెలిపారు. బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకోనివారితో పోలిస్తే ‌ తీసుకునేవారు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.

More Telugu News