sensex: అమ్మకాల ఒత్తిడితో బేర్ మన్న మార్కెట్లు

  • నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
  • 115 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 44 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందడం, ఏప్రిల్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించడంతో... ఈ రోజు స్టాక్ మార్కెట్ల లాభాలకు బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 115 పాయింట్లు కోల్పోయి 34,501కు పడిపోయింది. నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 10,571కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ (11.55%), ఇండియా బుల్స్ వెంచర్స్ (9.73%), నిట్ టెక్నాలజీస్ (8.25%), రేమండ్ లిమిటెడ్ (6.27%), పెర్సిస్టెంట్ సిస్టమ్స్ (6.08%).      

టాప్ లూజర్స్:
పీసీ జువెలర్స్ (-15.59%), హ్యాథ్ వే కేబుల్ అండ్ డేటాకామ్ లిమిటెడ్ (-8.59%), టైమ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్ (-5.76%), బాజాజ్ కార్ప్ (-5.52%), వెల్స్ పన్ కార్ప్ (-5.33%).  

More Telugu News