imran khan: ఇమ్రాన్ కు మూడో పెళ్లి కూడా కలిసిరాలేదు.. మళ్లీ ఒంటరి జీవితమే!

  • పెటాకులైన ఇమ్రాన్ మూడో పెళ్లి
  • పుట్టింటికి వెళ్లిపోయిన మనేకా
  • విభేదాలకు కారణం మనేకా కుమారుడే

పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు సంసారయోగం లేనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులిచ్చి ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న ఆయనకు... ఈ పెళ్లి కూడా అచ్చి రానట్టే ఉంది. రెండు నెలల్లోనే మూడో పెళ్లి పెటాకులైంది. మూడో భార్య బుష్రా మనేకా ఇమ్రాన్ ను వదిలిపెట్టి, తన పుట్టింటికి వెళ్లిపోయిందని పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి బుష్రా మనేకా కొడుకే కారణమని తెలిపింది. మనేకా కొడుకు తమతో పాటు ఉండటం ఇమ్రాన్ కు ఇష్టం లేదట. మరోవైపు, ఇమ్రాన్ ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కలు మనేకాకు నచ్చలేదట. దీంతో, ఎవరిదారి వారు చూసుకున్నారని పాక్ మీడియా కథనం.

పెళ్లికి ముందే ఇమ్రాన్, మనేకాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందట. మనేకా బంధువులు ఎవరూ ఎక్కువ రోజులు తమ వద్ద ఉండకూడదనేని ఆ ఒప్పందం. ఈ నేపథ్యంలో, మనేకా కుమారుడు తమ ఇంట్లోనే ఉండటం ఇమ్రాన్ కు చికాకు కలిగించింది. ఖవర్ ఫరీద్ అనే వ్యక్తితో మనేకాకు ఇంతకు ముందే పెళ్లయింది. వీరిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. మరోవైపు, ఇమ్రాన్ చెల్లెళ్లు కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. వారికి మనేకాను ఇమ్రాన్ పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. వీరి వల్ల కొత్త దంపతులు ఇద్దరి మధ్య అగాధం మరింత పెరిగింది. చివరకు ఎవరి దారి వారు చూసుకున్నారు. 1995లో జమీమాను, 2015లో టీవీ యాంకర్ రేహమ్ ఖాన్ ను ఇమ్రాన్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. 

More Telugu News