narasimhan: గవర్నర్ నరసింహన్ పై ఏపీ మంత్రి కాల్వ ఫైర్

  • కేంద్రానికి దూతలా నరసింహన్ వ్యవహరిస్తున్నారు
  • రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది
  • రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యేలా ప్రవర్తిస్తున్నారు

ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ పై విరుచుకుపడ్డ తర్వాత... ఈ రోజు మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శల పర్వాన్ని కొనసాగించారు. గవర్నర్ పని తీరును తప్పుబట్టిన కాల్వ... కేంద్ర ప్రభుత్వానికి దూతలా నరసింహన్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

ఏపీ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ గా నరసింహన్ పై ఉందని అన్నారు. విభజన హామీలు అమలయ్యేలా చూడాల్సిన నరసింహన్... రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యేలా ప్రవర్తిస్తున్నారని... ఆయన తీరుతో ప్రజాస్వామ్యానికి మచ్చ వచ్చే పరిస్థితులు దాపురించాయని దుయ్యబట్టారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుంటే... దానికి వ్యతిరేకంగా నరసింహన్ వ్యవహరిస్తుండటం దారుణమని విమర్శించారు. 

More Telugu News