evelyn sharma: మహేశ్ మూవీ ఛాన్స్ పోగొట్టుకున్నాను: ఎవెలిన్ శర్మ

  • బాలీవుడ్ మూవీస్ చేస్తోన్న ఎవెలిన్ శర్మ 
  • 'సాహో' ద్వారా తెలుగు తెరకు 
  • యాక్షన్ సీన్స్ కూడా చేస్తోందట      

ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. కొన్ని రోజులుగా 'అబుదాబి'లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. మరో కీలకమైన పాత్రలో బాలీవుడ్ భామ ఎవెలిన్ శర్మ కనిపించనుంది. ఈ విషయాన్ని తాజాగా ఎవెలిన్ శర్మ స్పష్టం చేసింది.

'సాహో' సినిమాలో ప్రాధాన్యత కలిగిన పాత్రను చేస్తున్నాననీ, యాక్షన్ సీన్స్ లోను కనిపిస్తానని అంది. ఈ పాత్ర తనకి ఎంతో సంతృప్తిని ఇచ్చిందనీ .. మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉందని చెప్పింది. గతంలో తనకి మహేశ్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ వచ్చిందనీ, అయితే డేట్స్ సర్దుబాటుకాకపోవడం వలన ఆయనతో కలిసి నటించడం కుదరలేదని అంది. చూస్తుంటే .. మహేశ్ సరసన మరోసారి ఛాన్స్ రాకపోతుందా అనే ఆశతో ఈ సుందరి ఎదురుచూస్తున్నట్టుగా అనిపిస్తోంది.      

More Telugu News