h1b visa: భారతీయులకు భారీగా తగ్గిపోయిన హెచ్1బీ వీసాలు

  • భారత ఐటీ కంపెనీలకు గతేడాది లభించినవి 8,468 వీసాలే
  • 2015లో ఈ సంఖ్య 14,792
  • 43 శాతం తగ్గుదల

అమెరికాలో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయా...? గణాంకాలు మాత్రం అవుననే పేర్కొంటున్నాయి. 2015 నుంచి 2017 మధ్య కాలంలో భారత ఐటీ కంపెనీలకు హెచ్1బీ వీసా దరఖాస్తు అనుమతులు 43 శాతం తగ్గిపోయాయి. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. 2017 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఐటీ కంపెనీలకు 8,468 హెచ్1బీ వీసాలు జారీ అయినట్టు తెలిపింది. 2015 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన 14,792 వీసాలతో పోలిస్తే 43 శాతం తగ్గాయని నివేదికలో పేర్కొంది.

టీసీఎస్ కంపెనీకి 2017లో 2,312 వీసాలు మంజూరయ్యాయి. 2015లో మాత్రం 4,674 వీసాలు లభించాయి. ఇన్ఫోసిస్ కు ఇదే కాలంలో 57 శాతం తగ్గాయి. 2,830 నుంచి 1,218కి తగ్గిపోయాయి. ఇలా ఏడు భారతీయ ఐటీ కంపెనీలకు సంబంధించిన వీసాల అనుమతుల్లో ఒక్క టెక్ మహింద్రాకు మాత్రం గతేడాది అధికంగా వీసాలు లభించాయి. 2015లో 1,576 మంజూరు కాగా, 2017లో 2,233 లభించాయి.

More Telugu News