Asaram Bapu: ఆశారాం బాపు అత్యాచారం చేశాడు: తేల్చిన న్యాయమూర్తి

  • 2013లో అరెస్టయిన ఆశారాం
  • సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితన్న న్యాయమూర్తి
  • మిగతా ఐదుగురూ దోషులే

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ అత్యాచారం చేశాడని రుజువైందని జోథ్ పూర్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆశారాం బాలికను రేప్ చేశారనడానికి సాక్ష్యాలున్నాయని చెప్పిన న్యాయమూర్తి, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితిని ఆయన కల్పించారని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చెప్పి, వారిని సన్మార్గంలో నడిపించాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి, తనను దేవుడిగా నమ్మి వచ్చిన అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టాడని అన్నారు. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న మిగతా ఐదుగురు కూడా దోషులేనని చెప్పారు. ఆశారాంకు మరికాసేపట్లో కోర్టు శిక్షను విధించనుంది.

కాగా, ఆశారాం ఓ బాలికను రేప్ చేశాడన్న ఆరోపణలతో 2013లో అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, ఆయన్ను జైలుకు తరలించగా, అప్పటి నుంచి ఆశారాం జైల్లోనే ఉన్నాడన్న సంగతి తెలిసిందే. పలుమార్లు ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఐదు రాష్ట్రాల్లో బలమైన నెట్ వర్క్ ను కలిగున్న ఆశారాంకు శిక్ష పడ్డ తరువాత విధ్వంసాలు జరగవచ్చన్న ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 30 వరకూ పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. బాధిత బాలిక ఇంటి వద్ద బలగాలను పెంచారు.

More Telugu News