kalyanram: కల్యాణ్ రామ్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం!

  • పూజా కార్య‌క్ర‌మాలకి జూనియ‌ర్ ఎన్టీఆర్, నంద‌మూరి రామ‌కృష్ణ‌, నంద‌మూరి హ‌రికృష్ణ
  • కల్యాణ్ రామ్ సరసన హీరోయిన్ లుగా షాలినీ పాండే, నివేదా థామస్‌
  • త్వ‌ర‌లోనే రెగ్యులర్ షూటింగ్ 

కేవీ గుహన్ ద‌ర్శ‌క‌త్వంలో కల్యాణ్ రామ్ హీరోగా కొత్త చిత్రం ఈరోజు ప్రారంభం అయింది. ఇది ఆయన 16వ చిత్రం. దీనికి శేఖ‌ర్ చంద్ర సంగీతం సమకూర్చనున్నారు. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలకి జూనియ‌ర్ ఎన్టీఆర్, నంద‌మూరి రామ‌కృష్ణ‌, నంద‌మూరి హ‌రికృష్ణ ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన షాలినీ పాండే, నివేదా థామస్‌లు హీరోయిన్ లుగా నటించనున్నారు. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది.

More Telugu News