Hyderabad: ర్యాష్ డ్రైవింగ్ తో ఒకరి ప్రాణాలు తీసిన విద్యార్థిని ఈశాన్య రెడ్డికి బెయిల్!

  • ఆదివారం నాడు కారు నడుపుతూ యాక్సిడెంట్
  • ఇంజనీరింగ్ విద్యార్థిని ఈశాన్య రెడ్డి అరెస్ట్
  • చంచల్ గూడ జైలుకు తరలింపు
  • బెయిల్ రావడంతో తిరిగి బయటకు

తన స్నేహితురాళ్లతో వెళుతూ, కారును వేగంగా నడుపుతూ ఫుట్ పాత్ పైకి ఎక్కించి, ఓ యువకుడి ప్రాణాలు తీసిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఈశాన్య రెడ్డికి బెయిల్ మంజూరైంది. హైదరాబాద్, కుషాయిగూడలోని డీఏఈ కాలనీలో ఆదివారం రాత్రి ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈశాన్య రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్ గూడ మహిళా జైలుకు రిమాండ్ పై తరలించగా, కోర్టు ఆమెకు మంగళవారం నాడు బెయిల్ ను మంజూరు చేసింది.

బెయిల్ పత్రాలు కోర్టుకు చేరడంతో ఆమెను విడుదల చేసినట్టు జైలు అధికారులు వెల్లడించారు. కాగా, కారులో నలుగురు అమ్మాయిలు ఉండగా, వారిలో ఒకరు మాత్రమే ఘటన జరిగిన సమయంలో మద్యం తాగి ఉందని, ఈశాన్య మద్యం తాగినట్టు వైద్య పరీక్షల్లో తేలలేదని పోలీసులు వెల్లడించారు. ఆ కారణంతోనే ఈశాన్యకు త్వరగా బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది.

More Telugu News