ap ngos president: ‘హోదా’ ఉద్యమాలు ఎంత వరకు సఫలమవుతాయో?: అశోక్‌బాబు సంచలన వ్యాఖ్యలు

  • ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది
  • ఉద్యోగస్తులమైన మేము రోడ్డు మీదకొస్తే వ్యవస్థ దెబ్బతింటుంది
  • రాష్ట్రాన్ని విడదీయమన్న పార్టీలూ నేడు మాట్లాడుతున్నాయి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఉద్యమాలు చేయడం ద్వారా ఎంత వరకు సఫలమవుతామనేది కాలమే నిర్ణయించాలని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటువంటి  పరిస్థితుల్లో తాము రోడ్డు మీదకు వస్తే, నష్టపోయేది ప్రజలేనని అన్నారు.

రాజకీయపార్టీలకు అడ్మినిస్ట్రేషన్ లో బాధ్యత ఉండదని, వాళ్లు ఏం చేసినా కూడా పార్టీ పరంగా పోతుందని, ఉద్యోగస్తులమైన తాము రోడ్డు మీదకొస్తే వ్యవస్థ దెబ్బతింటుందని, అందుకే, ఈ విషయమై తాము ఆలోచన చేయాల్సి వచ్చిందని అన్నారు. మరో విషయమేంటంటే, రాష్ట్రాన్ని విడదీయమన్న పార్టీలు కూడా నేడు రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడటం, కేంద్రాన్ని విమర్శించడం విచిత్రమైన పరిస్థితి అని అన్నారు. ఆ రోజున తాము ఉద్యమం చేసినప్పుడు ప్రత్యేక హోదా కావాలని గానీ, హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా పదేళ్లు ఉండాలని గానీ డిమాండ్ చేయలేదని పేర్కొన్నారు.

More Telugu News