AIR INDIA: ఎయిర్ ఇండియా విమానాల రిపేరింగ్ కూడా డబ్బుల్లేని పరిస్థితి... మూలనపడుతున్న విమానాలు

  • ప్రతీ నెలా రూ.250 కోట్ల వరకు నష్టాలు
  • మరమ్మతులకు వస్తున్న విమానాలు పార్కింగ్ కే పరిమితం
  • పౌరవిమానయాన శాఖ వెల్లడి

ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఈ సంస్థ రూ.48,876 కోట్ల అప్పులు చేసి తిరిగి చెల్లించలేని స్థితికి చేరడంతో దీన్ని అమ్మేసి భారం దింపుకుందామని కేంద్ర సర్కారు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నష్ట జాతక సంస్థను కొనేందుకు చివరికి టాటాలు కూడా ముఖం చాటేశారు. దీంతో నిబంధనలను సవరించి మరీ ఎయిర్ ఇండియాను కొనే నాథుడ్ని పట్టుకునే ప్రయత్నాలను కేంద్రం ప్రారంభించింది.

మరోవైపు నిధుల్లేక ఎయిర్ ఇండియా తన విమానాలకు మరమ్మతులు కూడా చేయించలేని స్థితికి వచ్చేసింది. ప్రతీ నెలా రూ.200-250 కోట్లు నష్టాలను ఎదుర్కొంటున్నందున నిధులకు కటకట ఉందని, ఫలితంగా స్పేర్ పార్ట్స్ కొనడానికి డబ్బుల్లేకపోవడంతో పలు విమానాలు పార్కింగ్ కే పరిమితమయ్యాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ అంగీకరించడం గమనార్హం.

More Telugu News