sri reddy: ఇదేనా, నీవు చేగువేరా నుండి తీసుకున్న ఆదర్శం?: నటి శ్రీరెడ్డి

  • మిస్టర్ .. ఏమిటి ఈ మాయ.. పాచిపోయిన లడ్డూలు అన్నావు
  • పవర్ ను అనుకున్నావు .. ఎన్ని చెత్త ప్లాప్ సినిమాలో లెక్కేసుకో
  • సినిమాల్లో నీకు నటన రాకపోయినా బయట బాగానే నటించావు
  • ప్రత్యేక హోదా ఇవ్వని మోడీకి కాపలాగా ఉన్నావు
  • తెలుగు ప్రజలు నిన్ను క్షమించరు

‘ఇదేనా నీవు చేగువేరా నుండి తీసుకున్న ఆదర్శం?’ అని ప్రశ్నిస్తూ నటి శ్రీరెడ్డి ఓ పోస్ట్ చేసింది. ‘‘ఫేస్ బుక్’ లోని నా ఫ్రెండ్స్ ఖాతాల్లో నాకు నచ్చిన పోస్ట్ లను డౌన్ లోడ్ చేసుకుని పెడుతున్న పోస్ట్ లు’ అంటూ నటి శ్రీరెడ్డి తాజాగా ఓ పోస్ట్ చేసింది. 

‘మిస్టర్ .. ఏమిటి ఈ మాయ.. పాచిపోయిన లడ్డూలు అన్నావు..
ఉత్తరం దక్షిణం అన్నావు .. అవినీతి జరుగుతుందన్నావు..
నిరూపించమంటే నాకు తెలవదు బయట అనుకుంటున్నారు .. చూసుకోండి అన్నావు..
నాకు కులం లేదూ అన్నావు .. మా రంగాను అన్యాయంగా చంపేశారు అని అన్నావు..
కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నావు .. పెద్ద ఫార్సు చేశావు..
లెక్కలు నేను తేలుస్తాను అన్నావు .. కమిటీలో దొంగల్ని పెట్టావు..
మా అన్న చేసింది తప్పు అన్నావు..
మా అన్న ను మోసం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకుంటాను అన్నావు..
నీకు గెలిచే సత్తా లేక పోయినా పెద్ద పోజు కొడుతూ మిమ్మల్ని నేనే గెలిపించాను అన్నావు..
పవర్ ను అనుకున్నావు .. ఎన్ని చెత్త ప్లాప్ సినిమాలో లెక్కేసుకో..
ఆడోళ్లంటే ఆటబొమ్మలనుకున్నావు .. ఒకటికి మూడు చేసుకున్నావు..
నీ అవసరాల కోసం అందర్నీ దగా చేశావు .. చివరకు అమ్మకు కూడా బురద పూశావు..
చివరకు చేత కాక నీ నిజ రూపం బయటపెట్టుకున్నావు .. దొంగల పార్టీతో చేతులు కలిపావు..
నీకు నటన రాదనుకున్నాము కానీ, సినిమాల్లో రాకపోయినా బయట బాగానే నటించావు..
నిన్నేమనాలి .. నువ్వు ఆంధ్ర ద్రోహివి... ప్రజా ద్రోహివి .. జనద్రోహివి.
తెలుగు ప్రజలు నిన్ను క్షమించరు..
ప్రత్యేక హోదా ఇవ్వని మోడీకి కాపలాగా ఉన్నావు .. ఎవరూ ఏ మాట మోడీని అన్నా..
మోడీని తిడతారా అని ట్విట్టర్ వేదికగా సపోర్ట్ చేస్తున్నావు...
ఇదేనా నీవు చేగువేరా నుండి తీసుకున్న ఆదర్శం....’ అని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.

More Telugu News