Chiranjeevi: ఈ నెల 28న అమెరికాలో.. 200 కార్లతో మెగాస్టార్‌ కోసం 'చిరు అసోసియేషన్‌ ఆఫ్ నార్త్ అమెరికా' ర్యాలీ

  • ఈ నెల 27, 28 తేదీల్లో అమెరికాలో చిరు
  • 'మా' సిల్వర్ జూబ్లి వేడుకల్లో పాల్గొననున్న మెగాస్టార్‌
  • హోటల్‌ నుంచి ఈవెంట్‌ సెంటర్‌ వరకు ర్యాలీ

మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌)ను ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతోన్న సందర్భంగా ఈ నెల 27, 28 తేదీల్లో సిల్వర్ జూబ్లి వేడుకల్లో పాల్గొనడానికి మెగాస్టార్‌ చిరంజీవి అమెరికాలోని డల్లాస్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరు అసోసియేషన్‌ ఆఫ్ నార్త్ అమెరికా... ఈ నెల 28న చిరంజీవి ఉండే హోటల్‌ నుంచి 'మా' నిర్వహించనున్న మెయిన్‌ ఈవెంట్‌ సెంటర్‌ వరకు 200 కార్లతో ర్యాలీ నిర్వహిస్తూ ఆయనను తీసుకెళ్లనుంది. ఈ ర్యాలీలో పాల్గొనాలనుకునే వారు తమకు తెలియజేయాలని అసోసియేషన్ పేర్కొంది. కాగా, ఈ వేడుకలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పలువురు పాల్గొననున్నారు.   

More Telugu News