temple: 400 ఏళ్ల ఆనవాయితీకి బ్రేక్.. ఆ గుడిలోకి పురుషులు ప్రవేశించాల్సి వచ్చిన వైనం!

  • 400 ఏళ్ల పురాతన గుడి
  • మహిళలకు మాత్రమే ప్రవేశం
  • గ్రామంలో వరదలు
  • వేరే గ్రామానికి గుడి తరలింపు

ఒడిశాలోని మా పంచబారాహి గుడికి ఓ విశిష్టత ఉంది. ఆ గుడిలోకి మగవాళ్లకు ప్రవేశం లేదు. అందులో పూజారులు కూడా ఆడవారే. 400 ఏళ్ల పురాతనమైన ఈ గుడిలోకి తాజాగా మగవాళ్లు ప్రవేశించాల్సి వచ్చింది. మామూలుగా ఐదుగురు దళిత మహిళా పూజారులు మాత్రమే ఈ గుడి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు. గుడిలోని విగ్రహాలను తాకే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. అయితే, ఇటీవల ఆ ప్రాంతంలోని సాతభయ గ్రామానికి వరదలు రావడంతో ఆ గుడిని మరో చోటికి తరలించాల్సి వచ్చింది.

ఆ విగ్రహాల బరువు ఒక్కోటి ఏకంగా 1.5 టన్నులు ఉంటుంది. వాటిని తీసుకుని 12 కిలోమీటర్ల దూరంలోని బగపాటియా గ్రామానికి వెళ్లాలంటే మగవాళ్ల సాయం తీసుకోవాల్సిందేనని నిర్ణయించుకున్న సదరు ఐదురుగు మహిళా పూజారులు కొందరు పురుషులను తీసుకొచ్చి వారి చేత మోయించారు. మగవారు ఆ విగ్రహాలను తాకినందుకు పరిహారంగా, కొత్త చోటుకి ఆ విగ్రహాలు చేరుకోగానే సంప్రోక్షణ పూజలు చేశారు. కాగా, సదరు గ్రామంలో వరదల తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

More Telugu News