kiara advani: కైరా అద్వాని దశ తిరిగినట్టే!

  • రికార్డు స్థాయి వసూళ్లతో 'భరత్ అనే నేను'
  • కైరా అద్వానికి యూత్ లో క్రేజ్ 
  • చరణ్ మూవీలోను ఛాన్స్ 

తొలి సినిమాతోనే స్టార్ హీరోకి జోడీగా ఛాన్స్ దక్కడం .. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అదృష్టం కైరా అద్వానికి పట్టిందని చెప్పక తప్పదు. మహేశ్ బాబు మూవీ 'భరత్ అనే నేను' సినిమాతో పరిచయమైన ఈ సుందరి, భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు చరణ్ .. బోయపాటి కాంబినేషన్లోను ఒక సినిమా చేస్తోంది.

ఈ సినిమా షూటింగులో రీసెంట్ గా చరణ్ జాయిన్ అయ్యాడు. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో సీన్స్ షూటింగ్ ఇంకా జరగలేదు. ఆయనతో షూటింగులో పాల్గొనే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టుగా కైరా అద్వాని చెబుతోంది. ఈ సినిమా కూడా హిట్ అయిందంటే ఇక్కడ కైరా హవా మొదలైపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

More Telugu News