Supreme Court: 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన సుప్రీంకోర్టు ధర్మాసనాల విచారణలు

  • రోజూ ఉదయం న్యాయమూర్తులతో చీఫ్ జస్టిస్ సమావేశం
  • ఐదు నిమిషాలకే పరిమితం
  • ఈ రోజు మాత్రం 20 నిమిషాల పాటు కొనసాగిన భేటీ

రోజువారీగా చూస్తే సుప్రీంకోర్టులో విచారణ కార్యకలాపాలు ఈ రోజు పావుగంట ఆలస్యంగా మొదలయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనకు ఇచ్చిన నోటీసును రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సమావేశం ఈ రోజు 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా జరిగింది. ప్రతీ రోజూ ఉదయం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి సమావేశమవడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే, ఇది 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు కొనసాగదు. కానీ ఈ రోజు మాత్రం ఈ భేటీ 20 నిమిషాల పాటు కొనసాగింది. ఇందులో రాజ్యసభ చైర్మన్ నిర్ణయంపై చర్చ జరిగిందీ, లేనిదీ తెలియరాలేదు. ఈ భేటీ కారణంగా ఈ రోజు ధర్మాసనాల విచారణ కార్యకలాపాలు 15 నిమిషాలు ఆలస్యమయ్యాయి. 

More Telugu News