Koratala Siva: సీక్వెల్ ఆలోచనలో కొరటాల .. అభిమానుల్లో ఆసక్తి

  • హిట్ చిత్రాల జాబితాలో 'భరత్ అనే నేను'
  • ఆలోచింపజేస్తోన్న సందేశాలు 
  • ఇతర భాషల్లోకి అనువాదం  

'భరత్ అనే నేను' సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంచనాలను అందుకోవడంలో కొరటాల సక్సెస్ అయ్యాడు. అలాగే మహేశ్ బాబును కొత్తగా చూపించి ఆయన అభిమానులను ఖుషీ చేశాడు. ఈ సినిమా ద్వారా కొరటాల ఇచ్చిన సందేశాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నాయి.

 ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి కొరటాల మాట్లాడుతూ, ఇతర భాషల్లోకి ఈ సినిమాను అనువదించే ఆలోచన ఉందని చెప్పారు. అలాగే ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఉందని అన్నారు. 'భరత్' రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజకీయపరమైన ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టాడనేది ఈ సీక్వెల్ లో చూపిస్తారట. మొదటి నుంచి కూడా మహేశ్ సీక్వెల్స్ చేయడానికి ఇష్టపడడు. మరి కొరటాల చేసిన ఆలోచన పట్ల ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి.         

More Telugu News