army rally: తెలంగాణ యువత కోసం మే 21 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ

  • పది రోజుల పాటు ఎంపికలు
  • సోల్జర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులు
  • 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హతలున్న వారికి అవకాశం

తెలంగాణ నిరుద్యోగ యువత కోసం మే నెల 21 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగనుంది. వరంగల్ పట్టణంలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఎంపికలు జరుగుతాయి. సోల్జర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, ట్రేడ్స్ మ్యాన్ తదితర ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయని, అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఆర్మీ అధికారులు సూచించారు. 17 నుంచి 23 ఏళ్లలోపు వయస్సు ఉండి, 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హతలు ఉన్న వారు ఎంపికలకు హాజరు కావొచ్చని పేర్కొన్నారు.

More Telugu News