subramanya swamy: అభిశంసన నోటీసు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ఆత్మహత్యకు పాల్పడింది: సుబ్రహ్మణ్యస్వామి

  • అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించిన రాజ్యసభ ఛైర్మన్ 
  • ఇది చెల్లుబాటు కాని వ్యవహారం
  • ఈ నిర్ణయానికి రెండు రోజులు అక్కర్లేదు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా పలు పార్టీలు సంయుక్తంగా ఇచ్చిన అభిశంసన నోటీసును తిరస్కరిస్తూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీసుకున్న నిర్ణయం సరైనదేనని బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యస్వామి అన్నారు.

అయితే, ఈ నిర్ణయం తీసుకునేందుకు ఆయన రెండు రోజుల సమయం తీసుకుని ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై విలేకరులు ఢిల్లీలో సుబ్రహ్మణ్యస్వామిని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ, ‘‘ఇది చెల్లుబాటు కాదు, నిరర్థకమైనది. ఈ చర్య ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకున్నట్టు అయింది’’ అని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు.

More Telugu News