YSRCP: సీఎం చంద్రబాబు నిరసన సభ రోజే వైసీపీ ‘వంచన దినం’!

  • ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాపై ప్రజలను వంచిస్తున్నారు
  • అది ప్రజలకు తెలియజేయాలి
  • 30వ తేదీన విశాఖపట్నంలో నిరాహారదీక్ష
  • పార్టీ కోర్ కమిటీ భేటీలో నిర్ణయం

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 30న తిరుపతిలో తలపెట్టిన నిరసన దినానికి వ్యతిరేకంగా ఆ రోజును వంచన దినంగా పాటించాలని ప్రతిపక్ష వైసీపీ నిర్ణయించింది. నిన్న రాత్రి ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బస చేసిన చోట పార్టీ కోర్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. అధికారం చేపట్టిన తర్వాత ఇంతకాలం ప్రత్యేక హోదా వద్దంటూ, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదని నిరసన దినం చేస్తూ ముఖ్యమంత్రి ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది.

దీన్ని ప్రజలకు తెలియజేసేందుకు అదే రోజు విశాఖపట్నంలో వైసీపీ అధ్వర్యంలో నిరాహార దీక్ష చేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కోర్ కమిటీ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొనడం గమనార్హం. పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Telugu News