posco: బాలికలపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించే ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి సంతకం

  • 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
  • మరికొన్ని కఠిన శిక్షలూ ప్రతిపాదన
  • కేంద్ర కేబినెట్ పంపించిన ఆర్డినెన్స్ కు వేగంగా రాష్ట్రపతి ఆమోదం

చిన్నారులపై దారుణాతి దారుణంగా అత్యాచారాలు పెరిగిపోతుండడంతో వాటికి కళ్లెం వేసేందుకు కేంద్ర మంత్రి వర్గం రూపొందించిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. 12 ఏళ్లలోపు వారిపై అత్యాచారం చేసే నిందితులకు మరణశిక్ష విధించే ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు. కేంద్ర కేబినెట్ నిన్న అత్యవసరంగా సమావేశమై ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్యువల్ అఫెన్సెస్ (పోస్కో)’ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ ను ఆమోదించిన విషయం తెలిసిందే. చిన్నారులపై అత్యాచారం చేసే వారికి గరిష్టంగా మరణశిక్షతోపాటు మరెన్నో కఠిన శిక్షల్ని ప్రతిపాదించారు. అనంతరం దీన్ని రాష్ట్రపతికి పంపగా ఆయన కూడా వేగంగా దీనికి అనుమతి తెలిపారు.

More Telugu News