one plus 6: వన్ ప్లస్ 6 విక్రయాలు అమేజాన్ ఇండియా వెబ్ సైట్లో త్వరలోనే... రిజిస్ట్రేషన్ కు అవకాశం

  • వన్ ప్లస్ ఫోన్లలోనే ఖరీదైనది
  • అధిక స్టోరేజీ, వేగంగా ఫేస్ అన్ లాక్ ఫీచర్లు
  • త్వరలోనే రానున్నట్టు అమేజాన్ డాట్ ఇన్ లో నోటిఫికేషన్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వన్ ప్లస్ 6 ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదలవుతోంది. అమేజాన్ ఇండియా వెబ్ సైట్లో దీన్ని ఎక్స్ క్లూజివ్ గా విక్రయించనున్నారు. ‘త్వరలోనే రానుంది’ (కమింగ్ సూన్) అంటూ అమేజాన్ డాట్ ఇన్ వెబ్ సైట్లో నోటిఫికేషన్ కనిపిస్తోంది. అందుబాటులోకి వచ్చిన వెంటనే తెలియజేసేందుకు గాను నోటిఫై మి అనే ఆప్షన్ కూడా ఉంది. మెయిల్ ఐడీ ఇచ్చినవారికి ఫోన్ వచ్చిన వెంటనే కంపెనీ సమాచారం అందిస్తుంది. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్లను కూడా తీసుకోనున్నట్టు అమేజాన్ ఇండియా తెలిపింది. ఫోన్ ఏ తేదీన అమ్మకాలకు వస్తుంది, ధర తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదు.

వన్ ప్లస్ 6 అనేది ఇప్పటి వరకు వచ్చిన వన్ ప్లస్ ఫోన్లలోనే ఖరీదైనది కానుంది. వన్ ప్లస్ 5టి ధర రూ.32,999 అని తెలిసిందే. అంటే వన్ ప్లస్ 6 ఇంతకంటే ఎక్కువే ఉంటుందని భావించొచ్చు. ఈ ఫోన్లో ఫేస్ అన్ లాక్ ఆప్షన్ క్రేజీగా ఉంటుందని, ఐఫోన్ ఎక్స్ కంటే వేగంగా అన్ లాక్ చేస్తుందని కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 8జీ ర్యామ్, 256 స్టోరేజీ ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News