suman: బీసీలమని మన గురించి మనం చెప్పుకోవడానికి సిగ్గెందుకు?: సినీ నటుడు సుమన్

  • బీసీలమని చెప్పుకునేందుకు కొందరు సిగ్గుపడుతున్నారు
  • బీసీలని చెప్పుకునేందుకు గర్వపడాలి
  • బీసీలు లేకుండా ఏ పార్టీ మనుగడ సాగించలేదు

బీసీ కులాల్లో పుట్టిన కొందరు తాము బీసీలమని చెప్పుకునేందుకు సిగ్గుపడతారని... సిగ్గు పడాల్సిన అవసరం ఏముందని సినీ నటుడు సుమన్ ప్రశ్నించారు. ఇకపై బీసీలమని చెప్పుకునేందుకు గర్వపడాలని చెప్పారు. బీసీలు రాజ్యాధికార దిశగా పయనించాలని... ఈ క్రమంలో విద్య, ఉపాధి పరంగా ముందడుగు వేయాలని సూచించారు.

బీసీలు లేకుండా, బీసీల ఓట్లు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, సుమన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి నటుడు ఆర్.నారాయణమూర్తి, దర్శకుడు శంకర్ తదితరులు హాజరయ్యారు.

More Telugu News