svbc: ఎస్వీబీసీ ఛైర్మన్‌గా రాఘవేంద్రరావు నియామకం

  • ఇప్పటివరకు ధర్మకర్తల మండలిలో సభ్యుడిగా రాఘవేంద్రరావు
  • ఆ ఛానెల్‌ డైరెక్టర్‌గా పనిచేసిన దర్శకుడు
  • చంద్రబాబు నాయుడి సలహా మేరకు ఛైర్మన్‌గా నియామకం

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌ ఛైర్మన్‌గా సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావును నియమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఈ రోజు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఛానెల్‌లో తిరుమల శ్రీవారికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేవస్థాన ధర్మకర్తల మండలిలో రాఘవేంద్రరావు సభ్యుడుగా, ఆ ఛానెల్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. తాజాగా, ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సలహా మేరకు ఆయనకు ఈ పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది.  

More Telugu News