Talasani: సినీ రంగంలో లైంగిక వేధింపులపై చర్చ.. సినీ ప్రముఖులతో మంత్రి తలసాని భేటీ

  • హాజరైన పోలీసులు, ఇతర శాఖల అధికారులు 
  • సమస్యలకు పరిష్కారం చూపే దిశగా భేటీ
  • క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ కొన్ని రోజులుగా కొందరి ఆరోపణలు

తెలుగు సినీ పరిశ్రమను సమస్యలు, వివాదాలు కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించే దిశగా దృష్టి సారించింది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులు, సినీ ప్రముఖులతో సమావేశం అయ్యారు. సినీరంగంలో తలెత్తిన వివాదాలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై చర్చించి అందుకు తగ్గ పరిష్కారం చూపుతూ చర్యలు తీసుకోనున్నారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ పలువురు మహిళా నటులు ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే.

More Telugu News