america: ఐవీ లీగ్‌ క్విజ్‌ పోటీలో గెలిచిన ఇండో అమెరికన్‌.. లక్ష డాలర్ల ప్రైజ్‌

  • అమెరికాలోని జియోపార్డీ కాలేజీలో పోటీలు
  • 1600 స్కోర్ సాధించి గెలిచిన ధ్రువ్‌ గౌర్‌
  • ఉన్నత చదువులకి వినియోగించుకుంటానని వ్యాఖ్య

అమెరికాలోని జియోపార్డీ కాలేజీలో తాజాగా జరిగిన ఐవీ లీగ్‌ క్విజ్‌ పోటీలో ధ్రువ్‌ గౌర్‌ అనే ఇండో అమెరికన్‌ యువకుడు ఏకంగా లక్ష డాలర్లు గెలుచుకున్నాడు. ఈ పోటీలో ఫైనల్‌లో ఆయన తలబడింది కూడా ఇండో అమెరికన్‌తోనే కావడం విశేషం.

రిశాబ్‌ జైన్‌ అనే యువకుడిపై ధ్రువ్‌ ఈ పోటీలో పాల్గొని 1600 స్కోర్ సాధించాడు. బ్రౌన్‌ యూనివర్సిటీలో చదువుతున్న ఆ యువకుడు.. తాను పోటీలో గెలుచుకున్న డబ్బును దాచుకుని తన ఉన్నత చదువులకి వినియోగించుకుంటానని చెప్పాడు. గత ఏడాది జరిగిన పోటీలో మరో భారతీయ అమెరికన్‌ విరాజ్‌ మెహతా మూడో స్థానంలో నిలిచాడు. అమెరికాలో ఈ క్విజ్‌ చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడ టీవీ ఛానెళ్లలో ఇది ప్రసారమవుతుంది.

More Telugu News