prabhas: 'సాహో' కోసం భారీ ఛేజింగ్ సీన్ .. రిస్క్ చేస్తోన్న ప్రభాస్

  • 'అబుదాబి'లో 'సాహో' షూటింగ్ 
  • యాక్షన్ సీన్స్ చిత్రీకరణ
  • హైలైట్ గా నిలవనున్న ఛేజింగ్ సీన్

ప్రభాస్ నటిస్తున్న 'సాహో' సినిమా కోసం 'అబుదాబి'లో మేజర్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. కొన్ని రోజులుగా అక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సహజత్వం కోసం ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ రోజు నుంచి కారు ఛేజింగ్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తూ యుఎస్ ఎ నుంచి కొన్ని కార్లను తెప్పించినట్టు సమాచారం.

ప్రభాస్ .. తదితరులపై చిత్రీకరించే ఈ కార్ల ఛేజింగ్ సీన్, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సన్నివేశాలను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ డిజైన్ చేశాడు. హాలీవుడ్ స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమాకి, శ్రద్ధా కపూర్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. 

More Telugu News