flipkart: మన దేశీ ఈ కామర్స్ మార్కెట్ పై ఇక అమెరికా కంపెనీల గుత్తాధిపత్యం!.. ఫ్లిప్ కార్టును కొంటున్న వాల్ మార్ట్

  • మరో రెండు వారాల్లో డీల్ పై ప్రకటన
  • 51 శాతం వాటాను సొంతం చేసుకునే అవకాశం
  • ఈ కామర్స్ లో తొలి రెండు స్థానాల్లో ఫ్లిప్ కార్ట్, అమేజాన్ ఇండియా

భారత ఈ కామర్స్ మార్కెట్ త్వరలోనే అమెరికా కంపెనీల ఆధిపత్యంలోకి వెళ్లనుంది. ఇందులో భాగంగా ఫ్లిప్ కార్ట్ కంపెనీని అమెరికాకు చెందిన వాల్ మార్ట్ కొనేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే ఒకటి రెండు వారాల్లో ప్రకటన వెలువడవచ్చని సమాచారం. ఫ్లిప్ కార్ట్ లో నియంత్రిత వాటా 51 శాతాన్ని వాల్ మార్ట్ కొననుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాల ఆధారంగా రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది.

ఫ్లిప్ కార్ట్ అనేది దేశీ ఈ కామర్స్ విభాగంలో అతిపెద్ద సంస్థ అనే విషయం తెలిసిందే. రెండో స్థానంలో అమెరికాకు చెందిన అమేజాన్ ఇండియా ఉంది. ఇప్పుడు నంబర్ 1 స్థానంలో ఉన్న  ఫ్లిప్ కార్ట్ ను వాల్ మార్ట్ కొనేస్తే అప్పుడు నంబర్ 1, 2 రెండూ కూడా అమెరికా కంపెనీలవే అవుతాయి. దాంతో దాదాపు మెజారిటీ మార్కెట్ ఆ కంపెనీల చేతుల్లోకే వెళుతుంది. ఈ కామర్స్ లో పేటీఎం మాల్ మూడో స్థానంలో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో 51 శాతం వాటాకు వాల్ మార్ట్ 10-12 బిలియన్ డాలర్లు ఆఫర్ చేస్తోందని సమాచారం. ఈ డీల్ మే మొదటి వారానికి పూర్తవుతుందని తెలుస్తోంది.

More Telugu News