Sri reddy: ఆ డిమాండ్ వాకాడ అప్పారావు కోసమా? మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లకా? కాస్కో నా వాస్కోడిగామా!: శ్రీరెడ్డి సంచలన కామెంట్స్

  • నిన్నటి పవన్ దీక్షతో నెగటివ్ మార్కులు
  • మా మహిళా సంఘానికి అంజనా దేవి పేరు పెడుతున్నాం
  • ఏపీలో వైసీపీ, చంద్రబాబులకు నా మద్దతు: శ్రీరెడ్డి

నటి శ్రీరెడ్డి మరోసారి పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, పోస్టులు పెట్టింది. "గూండాగిరి చేస్తే స్పెషల్ స్టాటస్ రాదు పీకే... ప్రాస్టిట్యూషన్ ను లీగలైజ్డ్ చేయాలని అంటున్నది వాకాడ అప్పారావు కోసమా? 3, 4 పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లకా?" అని ఓ పోస్టులో ప్రశ్నించిన శ్రీరెడ్డి, "ఏదో పొలిటికల్ అజెండాతో (చంద్రబాబునాయుడి దీక్ష నుంచి చూపు మరల్చేందుకు) అమ్మ పేరుతో నిన్న మా అసోసియేషన్ కు వచ్చిన నువ్వు, ఫుల్ నెగటివ్ మార్కులు వేయించుకుని వెళ్లావు. మీ అమ్మకు నువ్విచ్చిన విలువ కన్నా నేను ఎక్కువ విలువ ఇస్తాను. మా మహిళా సంఘానికి ఆవిడ పేరే పెడుతున్నాను. జిందాబాద్ అంజనా దేవీ" మరో పోస్టు పెట్టింది.

ఇక 'బట్టలు విప్పి మాట్లాడుకుందాం' అని పవన్ పెట్టిన పోస్టుపై స్పందిస్తూ, "కొత్త సినిమా... 'రాళ్లేసి కొట్టుకుందాం రా'... 'తిక్కకి లెక్క లేదు' ఈ పేరు కూడా బాగుంటుంది" అని వ్యాఖ్యానించింది. తాను ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, చంద్రబాబుకు మద్దతిస్తానని, అయితే ఏంటని కూడా ప్రశ్నించింది. "నువ్వు చితక్కొట్టించింది మీడియా వాళ్ల కార్లను కాదు. జర్నలిస్టుల మనోభావాలని... కాస్కో నా వాస్కోడిగామా" అని మరో పోస్టు పెట్టింది శ్రీరెడ్డి.





More Telugu News