keerthi suresh: ఆహ్లాదభరితంగా .. ఆనందకరంగా 'మహానటి' సాంగ్

  • సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ 
  • జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ 
  • మే 9న భారీస్థాయిలో రిలీజ్    

కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన 'మహానటి' చిత్రం .. మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా నుంచి ఒక్కో ఐటమ్ ను వదులుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ .. టీజర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ సినిమా నుంచి 'మూగమనసులు .. మూగమనసులు' అనే పాటను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. ఈ ఇద్దరూ ప్రేమలోపడిన సందర్భంలో ఈ సాంగ్ రానుందని తెలుస్తోంది. సిరివెన్నెల సాహిత్యం .. మిక్కీ జె. మేయర్ సంగీతం .. శ్రేయ ఘోషల్ స్వరం మనసు తలుపు తట్టేలా వున్నాయి. అద్భుతంగా వేసిన అందమైన సెట్ లో చిత్రీకరించిన ఈ పాట .. సావిత్రి కాలానికి తీసుకెళ్లినట్టుగా అనిపించకమానదు. మధురమైన ఈ మెలోడీ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

More Telugu News