Amit sha: జార్ఖండ్ స్థానిక ఎన్నికల్లో ఘన విజయం... స్వీప్ చేసిన బీజేపీ

  • ఐదు మునిసిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు
  • ఐదింటిలో గెలిచిన బీజేపీ 
  • ప్రజలకు మోదీపై నమ్మకం పోలేదన్న అమిత్ షా

జార్ఖండ్ లో జరిగిన ఐదు మునిసిపల్ కార్పొరేషన్లు, నగర పరిషత్, నగర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఐదు మునిసిపల్ కార్పొరేషన్లనూ ఆ పార్టీ అభ్యర్థులు స్వీప్ చేశారు. ప్రతిష్ఠాత్మక రాంజీ మునిసిపల్ కార్పొరేషన్ లో బీజేపీ మేయర్ అభ్యర్థిని ఆశాలక్రా విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన వర్షా గడ్డీపై గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ కుమార్ గుప్తా వీరిద్దరికీ చాలా దూరంలో నిలిచారు. హజారీబాగ్ లో మేయర్ పోస్టును బీజేపీకి చెందిన రోషిణీ తిర్కే, గిరిథ్ లో అదే పార్టీకి చెందిన సునీల్ కుమార్ పాశ్వాన్, ఆదిత్యపూర్  మునిసిపల్ కార్పొరేషన్ లో వినోద్ శ్రీవాత్సవ, మేదినీనగర్ లో బీజేపీకే చెందిన అరుణా శంకర్ లు విజయం సాధించారు.

ఇక ఈ విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ, ప్రజలకు మోదీపై ఉన్న నమ్మకానికి ఈ ఎన్నికలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఓటర్లు బీజేపీ ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోలేదని, దాని ప్రభావమే ఇంతటి ఘన విజయానికి కారణమని అభిప్రాయపడ్డారు.

More Telugu News